

మహా శివరాత్రి సందర్భంగా మైథో-యాక్షన్ చిత్రం ‘నాగబంధం’ టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. అభిషేక్ నామా దర్శకత్వంలో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రం భారీ నిర్మాణ విలువలతో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. హిమాలయాల నేపథ్యంతో పురాణ, చారిత్రక అంశాలను కలగలిపిన ఈ కథలో నాగబంధం ఆలయం చుట్టూ సాగే ఆసక్తికర కథనాన్ని టీజర్ పరిచయం చేసింది.
టీజర్ విడుదల అనంతరం దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. అద్భుతమైన విజువల్స్, హైఎండ్ VFX, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. టీజర్‌ను విడుదల చేసిన మహేష్ బాబు, ‘వరల్డ్ ఆఫ్ నాగబంధం ఎంతో ఆసక్తికరంగా కనిపిస్తోంది’ అంటూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
విరాట్ కర్ణతో పాటు నభా నటేష్, ఈశ్వర్యా మీనన్, జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఈ వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!