

దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ‘యుఫోరియా’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇటీవల ఈ చిత్రాన్ని వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, గుణశేఖర్ ప్రత్యేకమైన కథన శైలి మరియు మేకింగ్‌ను ప్రశంసించారు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ తనకు ఎంతో నచ్చిందని, అందరూ తప్పక చూడాల్సిన చిత్రం అని పేర్కొన్నారు.
ఈ చిత్రంలో భూమికా చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. పోలీస్ దర్యాప్తు, పోక్సో చట్టం అమలు విధానం వంటి అంశాలను వాస్తవికంగా చూపించడంతో పాటు, మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే ప్రమాదాలను ఈ చిత్రం హైలైట్ చేసింది.
గుణ హ్యాండ్‌మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, యుక్త గుణ నిర్మించిన ఈ చిత్రానికి కాళ భైరవ సంగీతం అందించారు. సాంకేతికంగా కూడా ప్రత్యేకంగా నిలిచిన ఈ సినిమా సమాజానికి బాధ్యతాయుతమైన సందేశాన్ని అందించిందని చిత్రబృందం తెలిపింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!