

ఇటీవల కాలంలో ఎన్టీఆర్ ను చూసిన అభిమానులు ఆయన లుక్ పై చర్చ మొదలుపెట్టారు. గతంతో పోలిస్తే ఎన్టీఆర్ చాలా సన్నగా కనిపించడంతో, “మా అన్న ఇలా ఎందుకు మారిపోయాడు?” అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్టులు కూడా చేశారు. ఒక కొత్త సినిమా కోసం ఎన్టీఆర్ గణనీయంగా బరువు తగ్గినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ఈ విషయాన్ని పక్కనపెడితే, మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా పేరొందిన ఎన్టీఆర్ ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టులను లైనప్ లో పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దర్శకుడు కొరటాల శివతో చేయాల్సిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ దేవర 2 పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మొదటి భాగం విజయవంతమవడంతో పాటు, సినిమా చివర్లో దేవర 2 ఉంటుందని సూచన ఇవ్వడంతో సీక్వెల్ ఖాయమనే భావన ఫ్యాన్స్‌లో ఏర్పడింది. అయితే, చాలాకాలంగా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో, ఈ ప్రాజెక్ట్ లేదేమో అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి.
తాజాగా ఎన్టీఆర్ సినిమాల షెడ్యూల్స్, ప్రాధాన్యతల్లో మార్పులు రావడంతో దేవర 2 మళ్లీ ట్రాక్‌లోకి వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొరటాల శివ సిద్ధం చేసిన తాజా వెర్షన్ ఎన్టీఆర్‌కు నచ్చిందని, త్వరలోనే దేవర రెండో భాగం ప్రయాణం మొదలయ్యే అవకాశం ఉందని టాక్.
అయితే, ఇందులో ఎంతవరకు నిజం ఉందన్న విషయం పై ఇప్పటికైతే స్పష్టత లేదు. అయినప్పటికీ, అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!