

షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘కింగ్’ సినిమా షూటింగ్‌కు సంబంధించిన లీకులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిత్రబృందం ఆందోళన వ్యక్తం చేస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రస్తుతం కేప్ టౌన్ సముద్ర తీర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణేపై తెరకెక్కించిన రొమాంటిక్ మెలోడీ పాటకు సంబంధించిన విజువల్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి. సముద్ర అలల మధ్య ఇద్దరు స్టార్లు చేసిన డ్యాన్స్ మూవ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.
సాంగ్ క్లిప్‌లతో పాటు కొన్ని హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు కూడా బయటకు రావడంతో చిత్ర యూనిట్ మరింత అప్రమత్తమైంది. భారీ బడ్జెట్ సినిమాలకు ఇలాంటి లీకులు నష్టాన్ని కలిగిస్తాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై స్పందించిన సిద్ధార్థ్ ఆనంద్, లీక్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని అభిమానులను కోరారు. ఈ చిత్రంలో సుహానా ఖాన్ కీలక పాత్రలో కనిపించనుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. యాక్షన్‌తో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!