
క్రీడలు

కేవీఎన్ వెంకట్ మాట్లాడుతూ, చాలామంది జన నాయకన్ అనేది కేవలం సినిమా టైటిల్ మాత్రమే అనుకున్నారని, కానీ ఇప్పుడు జోసెఫ్ విజయ్ నిజంగానే తమిళనాడు “జన నాయకన్”గా మారిపోయారని అన్నారు. విజయ్ రాజకీయ ప్రస్థానం, ప్రజాదరణతో ఆయన నిజమైన ప్రజా నాయకుడిగా ఎదిగారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
అలాగే ఈ సినిమా విడుదలకు సంబంధించిన అప్డేట్ను కూడా కేవీఎన్ వెంకట్ వెల్లడించారు. ప్రస్తుతం చిత్రబృందం CBFC వెరిఫికేషన్, సర్టిఫికేషన్ కోసం ఎదురుచూస్తోందని తెలిపారు. సెన్సార్ సర్టిఫికేట్ క్లియర్ అయిన వెంటనే సినిమాను విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!