

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా, ఇదే బ్యానర్‌పై రూపొందిన ఇతర భారీ ప్రాజెక్టుల విడుదలలు మాత్రం అనిశ్చితిలో పడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తమిళ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకన్’ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలమైనప్పటికీ విడుదలకు సంబంధించిన స్పష్టత ఇంకా రాలేదు. సంక్రాంతి విడుదలగా ప్రకటించిన ఈ చిత్రం సెన్సార్ సంబంధిత కారణాలతో వాయిదా పడినట్లు సమాచారం.
అలాగే యష్ హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ చిత్రానికి కూడా పలుమార్లు విడుదల తేదీలు ప్రకటించినప్పటికీ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ప్రస్తుతం రీషూట్స్ జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన రెండు భారీ చిత్రాల విడుదలలు ఆలస్యం అవుతుండగా, చిరంజీవి-బాబీ కాంబినేషన్ మూవీ మాత్రం నిరాటంకంగా షూటింగ్ కొనసాగిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!