తమిళ చిత్ర పరిశ్రమ నుంచి మరో కొత్త అందం రాబోతుంది. కోలీవుడ్ లో గుర్తింపు పొందిన దంపతులు సుందర్ సి, ఖుష్బూ సుందర్ కుమార్తె అవంతిక హీరోయిన్గా వెండితెరకు పరిచయమవుతోంది. అవంతిక సినిమాల్లోకి వస్తుందన్న వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికి ముహూర్తం కుదిరింది. అయితే ఆమె తమిళ సినిమాతో కాకుండా మలయాళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. సుజేష్ అని ఇప్పన్ దర్శకత్వంలో ‘ఆరంభం’ చిత్రంతో అవంతిక కథానాయికగా పరిచయమవుతోంది. కేరళలోని త్రిసూర్ లో పూజా కార్యక్రమాలతో సినిమా మొదలైంది. సరితా, అల్తాఫ్ సలీమ్ ఇతర పాత్రధారులు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. తమిళంలోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అవంతిక తన మనసులో మాటను బయట పెట్టింది. 'సినిమాల్లోకి రావాలని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను. ఒకప్పుడు నేను లావుగా ఉండేదాన్ని. కరోనా సమయంలో ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. నటిగా కొనసాగాలంటే ఇప్పుడు ఫిట్ నెస్ ఎంతో అవసరం. నేను ఇప్పుడు పూర్తిగా మారాను. నటనకు కావలసిన క్వాలిటీస్ తెలుసుకున్నాను. నచ్చిన పాత్రలు చేసుకుంటూ ముందుకెళ్లాలని అనుకుంటున్నాను' అని తెలిపారు. ఫిల్మ్ సెలబ్రిటీస్ చాలామంది అవంతిక ఎంట్రీ పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!