

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్’ ట్రైలర్‌ను దర్శకుడు హరీశ్ శంకర్ గ్రాండ్‌గా విడుదల చేశారు. ధ్యానం నాన్నగారి ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్లపై పూర్వాజ్, పద్మనాభ రెడ్డి.ఎ. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హరీశ్ శంకర్ మాట్లాడుతూ, కార్యక్రమానికి వచ్చిన తర్వాత పూర్వాజ్‌ను సినిమా బడ్జెట్ గురించి అడిగానని తెలిపారు. ఆయన చెప్పిన బడ్జెట్‌లో ఇంత మంచి క్వాలిటీతో సినిమా రూపొందించడం గొప్ప విషయమని ప్రశంసించారు. ట్రైలర్ చూస్తేనే సినిమా నిర్మాణ నాణ్యత ఎంత బాగుందో అర్థమవుతోందని అన్నారు.
‘కిల్లర్’ కథలో న్యూరో లింక్ సాంకేతికతకు సంబంధించిన అంశం ఆసక్తికరంగా ఉంటుందని హరీశ్ శంకర్ పేర్కొన్నారు. ఎలాన్ మస్క్ న్యూరో లింక్‌పై పరిశోధనలు చేస్తున్న నేపథ్యంలో, ఆ సాంకేతికతకు సూపర్ షీ తోడైతే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ కథ రూపొందినట్లు వివరించారు. ఈ కాన్సెప్ట్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. పూర్వాజ్, జ్యోతి ఇద్దరూ పవన్ కల్యాణ్ అభిమానులని, వారి అభిమానమే తనను ఈ కార్యక్రమానికి వచ్చేలా చేసిందని కూడా చెప్పారు. ఇదే ఈవెంట్‌లో నిర్మాత, దర్శకుడు పూర్వాజ్ మరో ఆసక్తికరమైన ప్రకటన చేశారు. సినిమా సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్‌ను ఎవరైనా సరిగ్గా ఊహించి చెబితే కోటి రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించారు. దీంతో ‘కిల్లర్’ కథపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!