

Yash కథానాయకుడిగా Geetu Mohandas దర్శకత్వంలో రూపొందుతున్న బహుభాషా చిత్రం Toxic: A Fairy Tale for Grown-Ups నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను KVN Productions మరియు Monster Mind Creations సంస్థలు నిర్మిస్తున్నాయి.
ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న Kiara Advani, నదియా అనే పాత్రలో కనిపించనుందని చిత్రబృందం వెల్లడించింది. ఈ సందర్భంగా ఆదివారం ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
ఫస్ట్‌లుక్‌లో కియారా గ్లామరస్‌గా కనిపించినప్పటికీ, ఆమె ముఖంలోని హావభావాలు ఒక రకమైన విషాదాన్ని, భావోద్వేగ లోతును ప్రతిబింబిస్తున్నాయి. ఈ పాత్ర గురించి దర్శకురాలు గీతూ మోహన్ దాస్ మాట్లాడుతూ, కొన్ని పాత్రలు సినిమాకే పరిమితం కాకుండా నటులకు కొత్త గుర్తింపును ఇస్తాయని అన్నారు. నదియా పాత్రలో కియారా అభినయం విభిన్నంగా ఉంటుందని, ఆ నటనపై తనకు ఎంతో గర్వంగా ఉందని ఆమె తెలిపారు.
ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!