
జనరల్

కీర్తి సురేశ్ కొత్తదనం నిండిన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ తన సినీ ప్రయాణాన్ని మరింత విస్తరిస్తోంది. వివాహం తర్వాత ఆమె సినిమాల వేగాన్ని పెంచి, ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా కన్నెవెడి, తోట్టం, రౌడీ జనార్ధన, రఫ్తార్ వంటి చిత్రాలతో బిజీగా ఉంది. విభిన్న శైలుల్లో నటిస్తూ తన ప్రతిభను మరింతగా చూపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, కీర్తి మరో భారీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ హిందీ దర్శకుడితో ప్రేమ, ఉత్కంఠభరిత చిత్రంపై చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ఆమె సినీ ప్రయాణంలో కొత్త మైలురాయిగా నిలవనుంది. ‘బేబీ జాన్’తో హిందీ చిత్రరంగంలో అడుగుపెట్టిన ఆమె, రెండో చిత్రం ‘రఫ్తార్’ వచ్చే నెల విడుదలకు సిద్ధమవుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!