
న్యూస్

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాపై వివాదం ముదురుతోంది. ఈ సినిమా టీజర్లో చూపించిన కొన్ని సన్నివేశాలపై కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా కొన్ని ఇంటిమేట్ సీన్లు చాలా బోల్డ్‌గా ఉండి, ప్రేక్షకులు చూడటానికి తగినవిగా లేవని కమిషన్ అభిప్రాయం తెలిపింది.
ఈ అంశంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సెన్సార్ బోర్డు) కు మహిళా కమిషన్ లేఖ రాసింది. టీజర్‌ను వెంటనే తొలగించాలని, అలాగే తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ తరహా సన్నివేశాలు మహిళలు మరియు యువతపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కమిషన్ పేర్కొంది.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!