

ఇప్పుడు ఓటిటి యుగం నడుస్తోంది. సినిమా థియేటర్ రన్ పూర్తయిన వెంటనే ఆన్లైన్లో చూసే ప్రేక్షకులు ఎక్కువయ్యారు. కానీ కాంతార చాప్టర్ 1 మాత్రం థియేటర్ల క్రేజ్ ఇంకా తగ్గలేదని నిరూపిస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమై నాలుగు రోజులు గడిచినా, బుక్‌మైషోలో ఈ సినిమా ఇంకా ట్రెండింగ్‌లోనే ఉంది. గంటకు వెయ్యిన్నర టికెట్లు అమ్ముడవడం చిన్న విషయం కాదు. విడుదలై నెల దాటినా రోజుకు 25 వేల టికెట్లు ఆన్లైన్లో బుక్ అవుతున్నాయి. హిందీ వెర్షన్ మాత్రమే గత వీకెండ్లో రూ.2 కోట్లకు పైగా వసూలు చేసిందని బాలీవుడ్ ట్రేడ్ టాక్. అంటే థియేటర్ అనుభవాన్ని ఇంకా చాలా మంది ప్రాధాన్యంగా చూస్తున్నారు.
గత వారం కాంతార 800 కోట్ల మార్క్ దాటింది. ఇప్పుడు 1000 కోట్ల దిశగా పయనిస్తోంది. ఓటిటి రిలీజ్ కొద్దిగా ఆలస్యమైతే మరింత బలమైన రన్ వచ్చేదని విశ్లేషకులు అంటున్నారు. కన్నడలో సినిమా ఇంకా స్ట్రాంగ్‌గానే ఉంది. బెంగళూరు, బెలగావి, హుబ్లీ లాంటి నగరాల్లో ఇప్పటికీ హౌస్‌ఫుల్స్ పడుతున్నాయి. యాభై రోజుల వరకు రన్ అవుతుందని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు.
కంటెంట్ బలంగా ఉంటే ఓటిటి వచ్చినా, జనాన్ని తిరిగి థియేటర్‌కి రప్పించవచ్చని కాంతార మరోసారి చూపించింది.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!