

ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఆయన వైట్ అండ్ వైట్ దుస్తుల్లో ఓ ప్రముఖ హోటల్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆయన చుట్టూ భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ, కొంతమంది అత్యుత్సాహంతో ఫోటోలు తీసేందుకు ప్రయత్నించారు. వద్దని పలుమార్లు సూచించినా, ఆయన వెనకాలే వెళ్లి ఫోటోలు తీయడానికి యత్నించడంతో ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలు వీడియో రూపంలో బయటకు రావడంతో, అవి వేగంగా వైరల్ అయ్యాయి.
ఈ వీడియోను కొందరు అల్లు అర్జున్ అభిమానులు షేర్ చేస్తూ, సోషల్ మీడియాలో చర్చకు దారి తీశారు. మరోవైపు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దీనికి గట్టిగా స్పందిస్తున్నారు. పనిలో నిమగ్నమైన సమయంలో వ్యక్తిగత స్థలాన్ని గౌరవించకుండా ఫోటోలు తీయడం సరైందా? అని ప్రశ్నిస్తూ కౌంటర్ ఇస్తున్నారు. దీంతో ఈ అంశం ఫ్యాన్ వార్స్ కు దారితీస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!