
జనరల్

విజయ్ నటించిన తాజా చిత్రం ‘జననాయగన్’ విడుదలకు మరో కీలక అడుగు పడింది. ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ బోర్డుకు వ్యతిరేకంగా నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు మంగళవారం మద్రాసు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో, న్యాయపరమైన అడ్డంకులు తొలగి సినిమా విడుదలకు మార్గం సుగమమైంది.
పిటిషన్ ఉపసంహరణతో సెన్సార్ అంశంపై నెలకొన్న అనిశ్చితి తొలగిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో చిత్ర విడుదల తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. విజయ్ అభిమానుల్లో ఈ పరిణామం ఉత్సాహాన్ని నింపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!