

కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ నటించిన ‘జన నాయగన్’ (Jana Nayagan) సినిమా వివాదం సుప్రీం కోర్టు వరకు చేరిన విషయం తెలిసిందే. సినిమా విడుదల విషయంలో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం ఇటీవల నిరాకరించినప్పటికీ, సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మరో కీలక అడుగు వేసింది.
మద్రాసు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్న నేపథ్యంలో, CBFC ముందస్తుగా కేవియట్ పిటీషన్ దాఖలు చేసింది. దీని ప్రకారం, ఒకవేళ నిర్మాతలు సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేస్తే, ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకముందు సెన్సార్ బోర్డు వాదనను కూడా కోర్టు వినాల్సి ఉంటుంది. సెన్సార్ సమస్యల కారణంగా ఈ నెల 9 న విడుదల కావాల్సిన ‘జన నాయగన్’ వాయిదా పడింది. అదే రోజున సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని మద్రాసు హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ CBFC మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది.
సెన్సార్ సర్టిఫికెట్ జారీపై డివిజన్ బెంచ్ తాత్కాలిక స్టే విధించడంతో, నిర్మాణ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే సినిమా విడుదల విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన సుప్రీం కోర్టు, మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్‌కే వెళ్లాలని నిర్మాతలకు సూచించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!