
జనరల్

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులను అలరించిన జగపతి బాబు, ఇప్పుడు దక్షిణాదిలో బిజీ నటుడిగా కొనసాగుతున్నారు. హీరోగా అవకాశాలు తగ్గిన సమయంలో ‘లెజెండ్’ సినిమాతో విలన్గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, తాజాగా తన జీవితంలోని కష్టాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరుస పరాజయాలు, ఆర్థిక ఇబ్బందులు తనను తీవ్రంగా ప్రభావితం చేశాయని వెల్లడించారు.
అలాగే మద్యం వ్యసనం కారణంగా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని జగపతి బాబు తెలిపారు. డబ్బు జీవితంలో అవసరమే కానీ అదే జీవితం కాదని అన్నారు. హీరో, విలన్ అనే ట్యాగ్ల కంటే నటుడిగా గుర్తింపు పొందడానికే ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. యువత ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!