

టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ హీరోగా గుర్తింపు పొందిన రామ్ పోతినేని తన కెరీర్‌లోనే అత్యంత భిన్నమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడనే చర్చ సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇటీవల విడుదలైన పోస్టర్‌లో రక్తంతో తడిసిన మైక్ పట్టుకుని కనిపించిన రామ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్టర్ చూసిన తర్వాత ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదని, మాస్, యాక్షన్, భావోద్వేగాల మేళవింపుతో కూడిన ఇంటెన్స్ కథగా ఉండబోతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
ఈ చిత్రానికి కథను రామ్ స్వయంగా రాసుకున్నాడనే వార్తలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్‌తో ఆయన దర్శకుడిగానూ పరిచయం కావచ్చనే ప్రచారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మే 15 ఉదయం 10:08 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన పూర్తి ప్రకటన విడుదల కానుండగా, దర్శకుడు, హీరోయిన్, నిర్మాణ సంస్థ వంటి కీలక వివరాలపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రామ్ బర్త్‌డే సందర్భంగా రానున్న ఈ అప్‌డేట్ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!