

ది రాజా సాబ్ ఈసారి నార్త్ అమెరికాను కుదిపేయడానికి సిద్ధమవుతోంది. డిసెంబర్ 4 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాబోతుండగా, టికెట్లు ఓపెన్ అయిన క్షణంలోనే సర్వర్లు క్రాష్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జనవరి 8 న విడుదలయ్యే ఈ సినిమా కోసం ఓవర్సీస్లో ఇప్పటికే ఆతృత పెరిగిపోతోంది.
ఈ భారీ ఎంట్రీకి ముందు, ది రాజా సాబ్ కొన్ని మాన్స్టర్ ప్రీమియర్ రికార్డులను ఎదుర్కోబోతోంది కల్కి 2898 AD ($3.9M), RRR ($3.5M), పుష్ప 2 ($3.34M), OG ($3.13M), బాహుబలి 2 ($2.45M), అజ్ఞాతవాసి ($1.52M), గుంటూరు కారం ($1.42M). ఇవి చిన్న సంఖ్యలు కావు కానీ ఇలాంటి అసాధ్యాన్ని సాధ్యం చేసిన హీరోగా ప్రభాస్ పై ప్రేక్షకుల్లో బలమైన నమ్మకం ఉంది.
ప్రస్తుతం హైప్ ఆకాశాన్ని అంటుతుండగా, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు పూర్తి విశ్వాసంతో ముందుకు వస్తున్నారు. సోషల్ మీడియా మాత్రం ఈ సినిమాతో పూర్తిగా హీట్‌లో ఉంది. అందుకే ది రాజా సాబ్ నార్త్ అమెరికాలో వచ్చే భారీ ప్రీమియర్ తుఫాన్‌గా పరిగణిస్తున్నారు. ఇక ప్రశ్న ఒక్కటే ఈ సినిమా టాప్ 3లోకి వస్తుందా? టాప్ 5లో ఆగుతుందా? లేక నేరుగా నెంబర్ వన్ కుర్చీని లక్ష్యంగా చేసుకుందా?




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!