

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ మూవీ ది రాజా సాబ్ నుంచి బ్యూటిఫుల్ మెలొడీ సాంగ్ ‘సహన సహన..’ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ప్రభాస్–మారుతి–పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇది సెకండ్ సింగిల్. ‘సహన సహన..’ ఫుల్ లిరికల్ సాంగ్‌ను ఈ నెల 17 న సాయంత్రం 6:35 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ప్రోమోలో ప్రభాస్ కలర్‌ఫుల్ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్‌లో స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. సంగీత దర్శకుడు తమన్ ఈ పాటను తన కెరీర్లో ప్రత్యేకమైన మెలొడీగా కంపోజ్ చేయగా, ప్రభాస్ మరియు నిధి అగర్వాల్‌పై అద్భుతమైన లొకేషన్లలో ఈ పాటను చిత్రీకరించారు.
సంక్రాంతి కానుకగా జనవరి 9 న ది రాజా సాబ్ సినిమా వరల్డ్‌వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. హారర్ కామెడీ జానర్లో దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాపై రెబల్ ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
.png&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!