
టెక్నాలజీ

బాలీవుడ్‌లో ఎక్కువగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న హీరోయిన్ తాప్సీ పన్ను, సౌత్ ఫిలిం ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సౌత్‌లో పనిచేసిన సమయంలో వివక్షను ఎదుర్కొన్నానని ఆమె తెలిపారు. సీనియర్ నటులతో కలిసి నటించినప్పుడు యువ హీరోలు తనతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి వెనుకాడేవారని ఆమె పేర్కొన్నారు.
అలాగే 30 ఏళ్లు దాటిన మహిళా నటులు రొమాంటిక్, కామెడీ సినిమాలకు సరిపోరని తనకు చెప్పారని తాప్సీ వెల్లడించారు. ఈ వయో వివక్ష ప్రధానంగా మహిళలకు మాత్రమే ఎదురవుతోందని, హీరోలకు మాత్రం ఇలాంటి సమస్యలు ఉండవని ఆమె స్పష్టం చేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!