
సినిమాలు

బాలీవుడ్ స్టార్ అలియా భట్ యష్ రాజ్ ఫిల్మ్స్ రూపొందిస్తున్న ‘Alpha’ సినిమాలో కిల్లర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆమెను ఒక సాధారణ స్పైగా కాకుండా, చిన్నప్పటి నుంచే హత్యలకు శిక్షణ పొందిన అసాసిన్గా చూపించనున్నారని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ పాత్ర యష్ రాజ్ స్పై యూనివర్స్‌లో ఇప్పటివరకు కనిపించిన పాత్రల కంటే పూర్తిగా భిన్నంగా ఉండనుందని టాక్.
దర్శకుడు ఆదిత్య చోప్రా ఈ పాత్రను ఒక “ఫియర్లెస్, అన్జడ్జ్డ్ హీరోయిన్”గా డిజైన్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో శర్వారి, బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివ రవైల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం జూలై 3న విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!