

నూతన సంవత్సరం సమీపిస్తుండగా మెగా అభిమానుల్లో ఉత్సాహం మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు విడుదలకు సిద్ధమవుతుండగా, పవన్ కళ్యాణ్ (ఉస్తాద్ భగత్ సింగ్) మరియు రామ్ చరణ్ (పెద్ది) తమ సినిమాల నుండి కొత్త పాటలను విడుదల చేయనున్నారని సమాచారం. ఒకే సమయంలో ఈ రెండు పాటలు రావచ్చనే వార్తలతో మెగా ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగింది. పవన్, దేవిశ్రీ ప్రసాద్, హరీశ్ శంకర్ త్రయం గబ్బర్ సింగ్ తర్వాత మళ్లీ కలుస్తుండటంతో ఈ సాంగ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా మొదటి సాంగ్ “చికిరి” ఇప్పటికే మంచి స్పందన తెచ్చుకుంది. తాజా సమాచారం ప్రకారం రెండవ సాంగ్ ఒక మాస్ బీట్‌గా నూతన సంవత్సరం సమయంలో విడుదల కానుందని తెలుస్తోంది. అయితే బాబాయి, అబ్బాయి మధ్య ఎలాంటి క్లాష్ జరగదని, రెండు సినిమాలను కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నందున విడుదల సమయాన్ని సమన్వయపరుస్తారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎవరు ముందుగా వస్తారో చూడాలి కానీ ఈ నూతన సంవత్సరం మెగా అభిమానులకు ఖచ్చితంగా మ్యూజిక్ ఫెస్టివల్‌లా మారబోతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!