

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు సూపర్ ఎక్సైటింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాలో బన్నీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయ్యింది. ఇదిలా ఉండగా, అల్లు అర్జున్ తదుపరి సినిమా గురించి మరో హాట్ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో బన్నీ ‘ఇరుంబుకై మాయావి’ లో నటించబోతున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథాసూచన కూడా నెట్లో చక్కర్లు కొడుతోంది. అందులో యంగ్ సైంటిస్ట్‌గా అల్లు అర్జున్ కనిపించనున్నట్టు తెలుస్తోంది.
ఓ ప్రమాదంలో తన కుడి చెయ్యి కోల్పోయిన యువ శాస్త్రవేత్త, దానికి బదులుగా మెటల్ ఆధారిత ఆర్టిఫిషియల్ హ్యాండ్ను అమర్చుకుంటాడు. లేట్ నైట్ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ సమయంలో అనూహ్యమైన ఎలక్ట్రిక్ షాక్ తగలడంతో అతని శరీరం పూర్తిగా అదృశ్యమవుతుంది. ఆర్టిఫిషియల్ హ్యాండ్ మాత్రమే బయటకు కనిపిస్తుంది. ఈ అసాధారణ శక్తిని ఆయన నేరాలను అరికట్టడానికి ఉపయోగించుకోవడం, ప్రజల కోసం ‘హ్యూమన్ ప్రొటెక్టర్’ గా మారడం కథలోని ప్రధాన ఆకర్షణ అని టాక్.
ఈ కథ సోషల్ మీడియాలో బయటకు వచ్చాక బన్నీ అభిమానులు భారీ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. ఇదే అసలు స్టోరీ అయితే బాక్సాఫీస్ రికార్డులు మళ్లీ కొత్తగా రాయబడతాయనే నమ్మకంతో పాజిటివ్ వైబ్స్ పంచుకుంటున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!