
సినిమాలు

హీరోయిన్ నమిత సోషల్ మీడియాలో ఎదుర్కొన్న ట్రోలింగ్, దూషణల గురించి తాజాగా భావోద్వేగంగా స్పందించారు. తమిళ్ బిగ్‌బాస్ షోలో పాల్గొన్న సమయంలో ఎదురైన అనుభవాలను గుర్తుచేసుకుంటూ, సహజంగా ఉంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని, లేదంటే ప్రేక్షకులను ఆకట్టుకునేలా నటించాల్సి ఉంటుందని తెలిపారు. తనకు, తన స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు అన్యాయం జరిగితే తాను ఎప్పుడూ ధైర్యంగా ఎదుర్కొంటానని నమిత చెప్పారు.
సోషల్ మీడియాలో తనపై వచ్చిన కొన్ని కామెంట్లు చాలా అసభ్యకరంగా, బాధాకరంగా ఉన్నాయని నమిత వెల్లడించారు. మొదట్లో తన భర్త కామెంట్లను బ్లాక్ చేయమని చెప్పినా, తర్వాత తాను భయపడకుండా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. సోషల్ మీడియాలో కామెంట్ చేసే ముందు ఒకరి పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఆమె సూచించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!