

‘లస్ట్ స్టోరీస్ 3’ ఆంథాలజీ సిరీస్‌లో నిజజీవిత జంట అదితి రావ్ హైదరి, సిద్ధార్థ్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని దర్శకుడు విశాల్ భరద్వాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. నిజ జీవితంలో భార్యాభర్తలైనప్పటికీ, కెమెరా ముందు వారి వ్యక్తిగత బంధం ఏమాత్రం కనిపించలేదని ఆయన తెలిపారు. సెట్లో వారి మధ్య ఉన్న అనుబంధం కొంత సౌకర్యాన్ని కలిగించి ఉండవచ్చని, అయితే తెరపై మాత్రం వారిని నిజజీవిత జంటగా కాకుండా తమ పాత్రల్లో పూర్తిగా లీనమైన నటులుగానే చూశానని పేర్కొన్నారు.
ఈ సిరీస్‌లోని కొన్ని రొమాంటిక్ సన్నివేశాల కోసం చిత్రబృందం బాడీ డబుల్స్‌ను సిద్ధం చేసినప్పటికీ, అదితి, సిద్ధార్థ్ వాటిని ఉపయోగించేందుకు నిరాకరించి స్వయంగా నటించారని విశాల్ భరద్వాజ్ వెల్లడించారు. ఒక సన్నివేశంలో అదితి స్వయంగా నటించేందుకు ముందుకు వచ్చారని, సిద్ధార్థ్ కూడా తన పాత్రను నిబద్ధతతో పూర్తి చేశారని ప్రశంసించారు. విశాల్ భరద్వాజ్‌తో పాటు విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావు, శకున్ బత్రా దర్శకత్వం వహించిన ఈ ఆంథాలజీ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!