

జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఇటీవల మేకర్స్ ప్రత్యేక గ్లింప్స్ వీడియోను ప్రకటించడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా ఈ గ్లింప్స్ దాదాపు నాలుగు నిమిషాల నిడివితో ఉండబోతుందనే వార్త సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రత్యేక ప్రోమో విడుదల కానుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ హైప్ మధ్యలో దర్శకుడు ప్రశాంత్ నీల్ గత చిత్రం ‘సలార్’ గ్లింప్స్ కూడా సోషల్ మీడియాలో మళ్లీ చర్చకు వచ్చింది. అప్పట్లో ప్రభాస్‌ను పూర్తిగా చూపించకుండా మిస్టరీగా ప్రెజెంట్ చేసిన తీరు మిక్స్డ్ రియాక్షన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ‘డ్రాగన్’ విషయంలో కూడా అలాంటి సస్పెన్స్ ఉండొచ్చనే టాక్ వినిపిస్తున్నా, నాలుగు నిమిషాల గ్లింప్స్‌లో ఎన్టీఆర్‌ను పవర్‌ఫుల్‌గా చూపిస్తారనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటిగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!