

తమిళంలో ‘కరుప్పు’గా విడుదలైన సూర్య నటించిన ‘వీరభద్రుడు’ చిత్రం మొదటి రోజు మిక్స్డ్ టాక్, నెగెటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశ్చర్యకరంగా మంచి వసూళ్లు సాధిస్తోంది. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా హిట్ ట్రాక్‌లో కొనసాగుతోంది. భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం, కమర్షియల్ ఎలిమెంట్స్ కారణంగా ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల సూర్యకు పెద్ద హిట్ లేకపోవడంతో అభిమానులు ఈ సినిమాకు బలమైన మద్దతు ఇస్తున్నారని సమాచారం. అలాగే త్రిష ఎంట్రీ సీన్స్‌కు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోందని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. విడుదల సమయంలో ఎదురైన కొన్ని సమస్యలు కూడా సినిమాపై అదనపు ఆసక్తిని పెంచినట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద అనూహ్య కారణాల వల్ల ‘వీరభద్రుడు’ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ రన్ కొనసాగిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!