
.png&w=3840&q=75)
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు” ఇప్పటికే అమెరికా ప్రీమియర్స్‌లో సంచలనం సృష్టిస్తోంది. జనవరి 11న ప్రీమియర్స్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాకు ఇప్పటివరకు 5000+ టికెట్లు అమ్ముడవడం మెగా ఫ్యాన్స్‌లో ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, కామెడీ, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ పండుగ వాతావరణాన్ని తీసుకురాబోతోంది. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు.
షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం, “పండగకి వస్తున్నాం” అనే ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. స్టైలిష్ పోస్టర్లో చిరంజీవి పవర్ఫుల్ లుక్‌లో కనిపించడం, సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే అమెరికాలో టికెట్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయి, ఇది ఈ సినిమా ఓపెనింగ్‌కి బ్లాక్‌బస్టర్ స్థాయి రెస్పాన్స్ ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.




















కామెంట్స్ (1)
Great