

నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన సైకాలజికల్ హారర్ మూవీ ‘హనీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. కరుణ కుమార్ రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని OVA ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించారు. ఫిబ్రవరి 6 న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తిగా డిఫరెంట్ అనుభూతిని ఇస్తుందని హీరో నవీన్ చంద్ర తెలిపారు. ట్రైలర్‌కు వచ్చిన స్పందన చాలా సంతోషాన్ని ఇచ్చిందని, ఈ సినిమా మౌత్ టాక్‌తో నిలబడుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
డైరెక్టర్ కరుణ కుమార్ మాట్లాడుతూ, నిజ జీవిత సంఘటనల నుంచి స్ఫూర్తి పొందిన ఈ కథలో సైకాలజికల్ డెప్త్‌తో కూడిన హారర్ అంశాలు ఉంటాయని చెప్పారు. “మనిషి మెదడుకంటే పెద్ద దయ్యం లేదు” అన్నది ఈ సినిమా సారాంశమని వెల్లడించారు. రాజా రవీంద్ర, దివి, దివ్య పిళ్లై తదితర నటులు తమ పాత్రలు చాలా ప్రత్యేకంగా ఉంటాయని తెలిపారు. సాంకేతికంగా, భావోద్వేగంగా ప్రేక్షకులను వెంటాడే చిత్రంగా ‘హనీ’ నిలుస్తుందని చిత్ర బృందం విశ్వాసం వ్యక్తం చేసింది.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!