
జనరల్

హోంబాలే ఫిలిమ్స్ భారతీయ సినీ రంగంలో ప్రముఖ నిర్మాణ సంస్థగా గుర్తింపు పొందింది. ఇప్పుడు ఈ సంస్థ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. తమ తొలి అంతర్జాతీయ ప్రాజెక్ట్‌గా ‘పెద్ది’ సినిమాను ప్రకటించింది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాతో గ్లోబల్ మార్కెట్‌లో తమ స్థాయిని మరింత పెంచుకోవాలని హోంబాలే ఫిలిమ్స్ భావిస్తోంది.
ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే మంచి అంచనాలు సృష్టించింది. వచ్చే నెల 4 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా విదేశాల్లో కూడా మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!