

హాలీవుడ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘అబ్సెషన్’ 2026లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. కేవలం 1 మిలియన్ డాలర్లు (సుమారు రూ.10 కోట్లు) బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ స్వతంత్ర హారర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయాన్ని సాధిస్తోంది. యూట్యూబర్ కర్రీ బార్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మైఖేల్ జాన్స్‌టన్, ఇండే నవరాట్టె ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 15న అమెరికాలో విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది.
ఇప్పటివరకు అమెరికా, కెనడాలో ఈ చిత్రం 86 మిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ.730 కోట్లకు పైగా) వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 108 మిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ.900–950 కోట్లు) రాబట్టిన ఈ సినిమా త్వరలోనే రూ.1000 కోట్ల మార్క్ చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నెల 29న భారతదేశంలో విడుదలైన ఈ చిత్రం తొలి రోజు ప్రివ్యూలతో కలిపి రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ప్రేమ, భయం కలగలిసిన ఈ కథ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!