

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ‘హీ మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ చిత్రం ఇప్పుడు సరికొత్త యాక్షన్ విజువల్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ నిర్మాణంలో, దర్శకుడు ట్రావిస్ నైట్ తెరకెక్కించిన ఈ ఫాంటసీ యాక్షన్ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో ‘హీ మ్యాన్’ పాత్రకు టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ డబ్బింగ్ చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ట్రైలర్లో ఆయన గొంతు పవర్ఫుల్ పాత్రకు అద్భుతంగా సరిపోయిందని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
ఈ చిత్రంలోని ఇతర కీలక పాత్రలకు కూడా ప్రముఖ నటులు డబ్బింగ్ చెప్పారు. హాలీవుడ్ నటుడు జారెడ్ లెటో పోషించిన విలన్ పాత్రకు ఆదిత్య మీనన్ గొంతు అందించగా, డంకన్ పాత్రకు రావు రమేష్ డబ్బింగ్ చెప్పారు. గ్రాండ్ విజువల్స్, భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందిన ఈ చిత్రం జూన్ 5న తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుంది. ట్రైలర్ చూసిన నెటిజన్లు నిఖిల్ వాయిస్ సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!