
అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి పాన్ ఇండియా హిట్స్‌తో పాటు నేషనల్ అవార్డ్ అందుకున్న హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పుడు మైథలాజికల్ జానర్లో రూపొందుతున్న ‘త్రికాల’ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మణి తెల్లగూటి దర్శకత్వంలో రాధిక–శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘యాలో ఈ గుబులే ఎలో’ పాట విడుదలైంది. ఈ పాటలో హర్షవర్ధన్ రామేశ్వర్ స్టైల్, మెలోడీకి ఉన్న డెప్త్ అద్భుతంగా బ్యాలెన్స్ అయ్యాయి.
ఈ పాటకు అనురాగ్ కులకర్ణి వాయిస్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఆయన ఎమోషనల్ సింగింగ్ లవ్ ఫీలింగ్‌ను మరింత ఎలివేట్ చేయగా, రాకేందు మౌళి లిరిక్స్ క్యాచిగా ఆకట్టుకుంటున్నాయి. సుచిత్ర చంద్రబోస్ కొరియోగ్రఫీ పాటకు ప్రత్యేక వైబ్‌ను తీసుకొచ్చింది.
శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ట్రైలర్‌తోనే నార్త్ ఇండియాలో కూడా బిజినెస్ జరగడంతో సినిమాపై భారీ డిమాండ్ ఏర్పడింది. ‘త్రికాల’ త్వరలోనే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.



.webp&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!