

ఓజీ సినిమా మ్యూజిక్‌తో పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే సెలబ్రేషన్స్‌లో ఉన్నారు. పాటలకు ఫ్యాన్ ఎడిట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ హంగామా చేస్తుంటే, ఇప్పుడు మరో మంచి వార్త వచ్చింది. దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా ప్రకటించినట్టు, ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సింగిల్ డిసెంబర్‌లో రిలీజ్ కానుంది.
అల్లరి నరేష్ నటించిన 12A రైల్వే కాలనీ ప్రీ రీలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన హరీష్ శంకర్, తన స్పీచ్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఏ తేదీన పాట వస్తుందో ఇంకా చెప్పలేదు కానీ డిసెంబర్‌లో మాత్రం ఖచ్చితంగా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ విషయానికి వస్తే, 2026 సమ్మర్‌కి గ్రాండ్ రిలీజ్ కోసం టీమ్ ప్రయత్నిస్తోంది.
2012లో గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాణ్-హరీష్ కాంబినేషన్ సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అదే జోష్, అదే ఎనర్జీతో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా భారీ బ్లాక్‌బస్టర్ అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు.




















కామెంట్స్ (1)
Pawan’s screen presence is pure mass power