

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న హనుమాన్ అంశ్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం విడుదలైన తర్వాత భారీ వసూళ్లు సాధించింది. దర్శకుడు విశాల్ చతుర్వేది తెరకెక్కించిన ఈ సినిమా ఆధ్యాత్మికతతో పాటు సినిమాటిక్ అనుభూతిని అందించేలా రూపొందించారు. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. దీంతో తక్కువ బడ్జెట్లో రూపొందిన చిత్రాల్లో భారీ విజయాన్ని నమోదు చేసిన సినిమాగా హనుమాన్ అంశ్ నిలిచింది. హిందీతో పాటు పలు భాషల్లో ఆదరణ పొందిన ఈ చిత్రాన్ని ఇప్పుడు హోంబలే ఫిల్మ్స్ తెలుగు ప్రేక్షకులకు అందించనుంది.
అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా తెలుగు వెర్షన్ విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది. ఇతర భాషల్లో వచ్చిన స్పందన నేపథ్యంలో తెలుగు వెర్షన్‌పై కూడా ఆసక్తి ఏర్పడింది. ఇదిలా ఉంటే హనుమాన్ అంశ్ కథను మొత్తం 3 భాగాలుగా రూపొందించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. రెండో భాగంగా హనుమాన్ అంశ్ 2 తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నిర్మాత అనుప్రియా నాగర్ తెలిపిన వివరాల ప్రకారం, కథ అవసరాన్ని బట్టి మాత్రమే సీక్వెల్ బడ్జెట్ పెంచాలని భావిస్తున్నారు. లేకపోతే తొలి భాగానికి ఉపయోగించిన స్థాయిలోనే ఖర్చుతో నిర్మించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!