
సినిమాలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు మే 20 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా భారీ అప్డేట్ రానుందనే ప్రచారం టాలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేస్తున్న మైథలాజికల్ ప్రాజెక్ట్ నుంచి ప్రత్యేక వీడియో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఈ సినిమా కుమారస్వామి పాత్ర ఆధారంగా రూపొందనుందని, గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ఎన్టీఆర్ ప్రత్యేకంగా సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. అలాగే ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న ప్రాజెక్ట్‌తో పాటు దేవర సీక్వెల్‌పై కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!