

విశ్వక్ సేన్ హీరోగా, అనుదీప్ కె.వి దర్శకత్వంలో రూపొందిన ‘ఫంకీ’ చిత్రం ఫిబ్రవరి 13న విడుదలకు సిద్ధమవుతోంది. ఖమ్మంలోని లేక్ వ్యూ క్లబ్లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ప్రీ రిలీజ్ వేడుకలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ, ‘ఫంకీ’ పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రతి ఒక్కరినీ విపరీతంగా నవ్విస్తుందని తెలిపారు. దర్శకుడు అనుదీప్ ప్రత్యేకమైన కామెడీ శైలి ఈ సినిమాకు ప్రధాన బలమని, కథానాయిక కయాదు లోహర్తో తన జోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. కుటుంబంతో కలిసి చూసే వినోదభరితమైన చిత్రంగా ‘ఫంకీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!