

G.O.A.T టీజర్ లాంచ్ కార్యక్రమంలో నిర్మాత మొగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, మాస్–ఫన్–యాక్షన్ అంశాలను చక్కగా మిళితం చేసి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రంగా G.O.A.T రూపుదిద్దుకుందని చెప్పారు. సుడిగాలి సుధీర్, దివ్యభారతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రికెట్ నేపథ్య కామెడీ చిత్రాన్ని జైశ్నవ్ ప్రొడక్షన్ మరియు మహాతేజ క్రియేషన్స్ నిర్మించాయి. దివ్యభారతి మాట్లాడుతూ, తమిళంలో బ్యాచిలర్ ఎంత మంచి పేరు తెచ్చిందో, తెలుగులో G.O.A.T కూడా అలాంటి విజయాన్ని అందిస్తుందనే నమ్మకం ఉందన్నారు. కథ విన్న వెంటనే కామెడీ ఆమెను ఆకట్టుకుందనీ, సుధీర్ మల్టీ-టాలెంటెడ్ అని, నిర్మాతల ప్యాషన్ మరియు సపోర్ట్ కు కృతజ్ఞతలు తెలిపారు. నటుడు నితిన్ ప్రసన్న మాట్లాడుతూ, ఈ సినిమాలో తన పాత్ర తనకు ఎంతో దగ్గరగా అనిపించిందనీ, మిగతా టీంతో కలిసి అద్భుతమైన సినిమాను చేశామని చెప్పారు.
నిర్మాత చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రారంభ దశలో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ, కొత్త టీంతో సినిమా రీవర్క్ చేసి అద్భుతమైన అవుట్‌పుట్ తీసుకువచ్చామని తెలిపారు. టీజర్‌ని విడుదల చేసిన దిల్ రాజు గారికి ధన్యవాదాలు చెబుతూ, మీడియా ఇచ్చిన సపోర్ట్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రం పూర్తి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక సామాజిక సమస్యను కూడా స్పృశిస్తుందని చెప్పారు. దివ్యభారతి, నితిన్ ప్రసన్న, మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న మణిశర్మ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. మణిశర్మ గారి సహకారం ఈ చిత్రానికి ఒక గొప్ప అదృష్టమన్నారు. కో-ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, G.O.A.T ఒక పక్కా మాస్ ఎంటర్టైనర్ అవుతుందని, టీమ్‌కు విజయాన్ని కోరుకుంటున్నానని చెప్పారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిగా ముగిసిందని, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని మేకర్స్ వెల్లడించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!