

నితేశ్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణం’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. సినిమా పాత్రల పరిచయంలో భాగంగా తాజాగా జటాయువు పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ కీలక పాత్రకు ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ తన గాత్రాన్ని అందించారు. ఆకట్టుకునేలా ఉన్న జటాయువు ఫస్ట్ లుక్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. బాలీవుడ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ చిత్ర విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.
రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలోని తొలి భాగానికి ‘రామాయణం: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ అనే పేరు పెట్టారు. ఈ భాగం నవంబర్ 5, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 20 నుంచి ముందస్తు టికెట్ బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ చిత్రంలో సాయి పల్లవి, యశ్, సన్నీ డియోల్, వివేక్ ఒబెరాయ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, రవి దూబే, అరుణ్ గోవిల్ తదితరులు నటిస్తున్నారు. నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!