
సినిమాలు

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ఐ యామ్ గేమ్ పై భారీ హైప్ నెలకొంది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘ఆర్డీఎక్స్: రాబర్ట్ డోని జేవియర్’ సినిమాతో గుర్తింపు పొందిన నహాస్ హిదాయత్ ఈ చిత్రాన్ని స్టైలిష్‌గా తెరకెక్కిస్తున్నారు.
దుల్కర్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రం యాక్షన్, ఎమోషన్, క్రైమ్ అంశాల మేళవింపుతో రూపొందుతోంది. ఆంటోనీ వర్గీస్, కయాదు లోహర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా టీజర్ త్వరలో విడుదల కానుండటంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. దుల్కర్ గత చిత్రాల విజయాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై అంచనాలు మరింత పెరిగాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!