
ఆరోగ్యం

'రోమాంచకం' సినిమా నుంచి తొలి పాట 'రాధా రమణ'ను చిత్ర బృందం విడుదల చేసింది. శాశ్వత ప్రేమ అందాన్ని ఆవిష్కరించే ఈ మధురమైన మెలోడీకి వాసుకి వైభవ్ సంగీతం అందించడమే కాకుండా స్వయంగా ఆలపించారు. చంద్రబోస్ సాహిత్యం ఈ పాటకు మరింత భావోద్వేగాన్ని జోడించింది. విడుదలైన వెంటనే ఈ గీతం సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

సుమంత్ ప్రభాస్, అనంతిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సనీల్ కుమార్ దర్శకత్వం వహించగా, సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాణంలో భాగస్వాములయ్యారు. వేణు, ఉపేంద్ర లిమాయే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!