

ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “స్కై” సినిమా ట్రైలర్‌ను ఈ రోజు విడుదల చేశారు. ఈ చిత్రం వచ్చే నెల 6 న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. వేలార్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో మురళీ కృష్ణంరాజు, శ్రుతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ సినిమాకు పృధ్వీ పెరిచర్ల దర్శకత్వం వహించగా, నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మాతలుగా వ్యవహరించారు. ట్రైలర్ ఫ్రెండ్స్ మధ్య జరిగే సరదా సన్నివేశాలతో ప్రారంభమై, హీరో–హీరోయిన్ మధ్య పరిచయం ప్రేమగా మారే దశను హృద్యంగా చూపించింది. హీరోయిన్ పాత్రను స్ట్రాంగ్‌గా డిజైన్ చేసినట్లు ట్రైలర్ స్పష్టంగా తెలియజేస్తుంది. హీరో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ భావోద్వేగంగా ఉండగా, అపార్థాల వల్ల ప్రేమలో ఏర్పడే విభేదాలు ఆసక్తిని పెంచుతున్నాయి. హీరో–తండ్రి మధ్య ఉన్న ట్రాజెడీ ఏమిటి? ఈ జంట ఎలా తిరిగి ఒక్కటయ్యారన్నది వెండితెరపై చూడాల్సిందే. ఈ చిత్రంతో శివ ప్రసాద్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!