
సినిమాలు

ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ మేకా, రవితేజ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 2002లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించడమే కాకుండా, బుల్లితెరపై పలుమార్లు ప్రసారమై ప్రేక్షకాదరణ పొందింది.
ప్రస్తుతం రీ-రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ దేశభక్తి చిత్రం కూడా మళ్లీ థియేటర్లలోకి రానుంది. ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కావడం వల్ల ఈ చిత్రానికి మరింత ప్రాధాన్యం ఏర్పడనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!