

మురారి రీ-రిలీజ్ పోస్టర్ చూస్తూనే నాస్టాల్జియా తట్టిలేపుతుంది. కుర్చీలో రిలాక్స్‌గా కూర్చుని, సంప్రదాయ తెల్లని వేషధారణలో కనిపిస్తున్న మహేష్ బాబు లుక్ ఆయన పాత్రలోని అమాయకత్వం, ఆత్మవిశ్వాసం, సింప్లిసిటీని అద్భుతంగా ప్రతిబింబిస్తోంది. ముఖంపై చిరునవ్వుతో కనిపిస్తున్న మహేష్ బాబు ఎక్స్ప్రెషన్ ఈ పాత్రకు ప్రేక్షకులు ఎందుకు ఇప్పటికీ కనెక్ట్ అవుతారో చెప్పకనే చెబుతుంది.
డిసెంబర్ 31 న న్యూ ఇయర్ స్పెషల్‌గా రీ-రిలీజ్ అవుతున్నట్లు ప్రకటిస్తూ ఈ పోస్టర్ మురారి ఎవర్గ్రీన్ మ్యాజిక్‌ను మరోసారి గుర్తు చేస్తోంది. కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భావోద్వేగాలు, బలమైన కథనం, సంప్రదాయం–విధి మేళవింపుతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కాలం గడిచినా తాజాదనాన్ని కోల్పోని ఈ చిత్రం మళ్లీ వెండితెరపై మెరవడం, పాత జ్ఞాపకాలను తిరిగి బ్రతికించడమే కాకుండా, కొత్త తరం ప్రేక్షకులకు కూడా మురారిని పరిచయం చేయనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!