

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సీతా పయనం’ నుంచి ఎనర్జిటిక్ మాస్ సాంగ్ ‘బసవన్న’ విడుదలైంది. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా పరిచయం అవుతుండగా, నిరంజన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అర్జున్ ప్రత్యేక పాత్రలో నటించగా, ఆయన మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా స్పెషల్ కామియోలో సందడి చేయనున్నారు.
ధ్రువ సర్జా పాత్రను పరిచయం చేస్తూ విడుదలైన ‘బసవన్న’ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బసవన్న పాత్రలో ధ్రువ సర్జా పవర్‌ఫుల్‌గా కనిపిస్తుండగా, అనూప్ రూబెన్స్ అందించిన బాణీ పాటకు ప్రత్యేక శక్తిని అందించింది. కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్, నకాస్ అజీజ్ మరియు ఎల్. కీర్తన గాత్రం గూస్బంప్స్ ఇస్తున్నాయి. లలితా శోభి, శ్రష్టి వర్మ కొరియోగ్రఫీ ఈ పాటకు మరింత హైప్ తెచ్చింది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 14 న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!