

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా డ్రాగన్ మూవీ టీమ్ అభిమానులకు భారీ ట్రీట్ అందించింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ చిత్రానికి సంబంధించిన నాలుగు నిమిషాలకు పైగా నిడివి గల గ్లింప్స్ విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చీకటితో నిండిన సామ్రాజ్యాలు, రక్తపాతం, ప్రతీకార యుద్ధాలు, భారీ యాక్షన్ సన్నివేశాలతో వీడియో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచింది.
కేజీఎఫ్, సలార్ తరహాలోనే భారీ ప్రపంచాన్ని ఈసారి డ్రాగన్ కోసం సృష్టించినట్లు గ్లింప్స్ స్పష్టం చేస్తోంది. ఎన్టీఆర్‌ను ఇప్పటివరకు చూడని విధంగా పవర్ఫుల్ అవతార్‌లో చూపించడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. డార్క్ విజువల్స్, ప్రశాంత్ నీల్ మార్క్ డైలాగ్స్, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ గ్లింప్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్ సాధించడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా డ్రాగన్ గురించే చర్చ సాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!