

మలయాళంలో సంచలన విజయాన్ని సాధించిన ‘దృశ్యం’ ఫ్రాంచైజీకి మూడో భాగం ఈ ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు జీతూ జోసెఫ్, హీరో మోహన్‌లాల్ కలయికలో రూపొందుతున్న ఈ చివరి భాగంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అదే సమయంలో తెలుగు రీమేక్‌పై అనిశ్చితి నెలకొంది.
తెలుగులో ‘దృశ్యం’ మరియు ‘దృశ్యం 2’ చిత్రాలు వెంకటేష్ హీరోగా మంచి విజయాన్ని సాధించాయి. కానీ ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంతో పాటు అనంతరం అనిల్ రావిపూడి ప్రాజెక్ట్‌లో బిజీగా ఉండటం వల్ల ‘దృశ్యం 3’ షూటింగ్‌కు సమయం కేటాయించడం కష్టంగా మారింది.
మలయాళ వెర్షన్ ముందుగా విడుదలై తర్వాత ఓటీటీలో వచ్చినట్లయితే కథలోని ట్విస్టులు ముందే బయటపడే అవకాశం ఉండటంతో తెలుగు రీమేక్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయినప్పటికీ ఫ్రాంచైజీకి ముగింపు ఇచ్చే ఈ భాగాన్ని వెంకటేష్ వదిలే అవకాశం తక్కువగా ఉండటంతో తెలుగు వెర్షన్ ఎప్పుడు ప్రారంభమవుతుందన్నది ఆసక్తిగా మారింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!