
క్రీడలు

దూరదర్శిని మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. సువిక్షిత్, గీతికా రతన్ జంటగా నటిస్తున్న ఈ ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్టైనర్కు కార్తికేయ కొమ్మి దర్శకత్వం వహించారు. వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి ఎం, పాటిమీది సంతోష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రైలర్ విడుదల సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమా ప్రేక్షకులను 90వ దశకపు మధుర జ్ఞాపకాలలోకి తీసుకెళుతుందని తెలిపారు. హీరో సువిక్షిత్ మాట్లాడుతూ అరుణాచలంలో కలిసిన ఓ పెద్దాయన జీవిత కథే ఈ సినిమాకు ప్రేరణ అని చెప్పారు. తండ్రి-కొడుకు భావోద్వేగాలు, కుటుంబ విలువలు, మానవ సంబంధాలను హృదయాన్ని హత్తుకునేలా ఈ చిత్రంలో చూపించామని వెల్లడించారు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు భావోద్వేగానికి గురికాకుండా ఉండరని హీరో పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!