

తెలుగు సినిమాల్లో ఒకప్పుడు కథతో పాటు టైటిల్‌కూ ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆకట్టుకునే పేర్లతోనే ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచేవారు. అయితే, ప్రస్తుతం కొన్ని చిత్రాలకు పెడుతున్న టైటిళ్లు చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా హీరో మౌళి నటిస్తున్న ‘దొంగ నా కొడుకు’ సినిమా పేరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ టైటిల్‌పై కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంతో కలిసి సినిమా చూడాలంటే టైటిల్ కూడా అభ్యంతరకరంగా ఉండకూడదని, ఇలాంటి పేర్లు సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తాయని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, సినిమా టైటిల్‌ను బట్టి కథను అంచనా వేయడం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మౌళి.. ఇప్పుడు ‘దొంగ నా కొడుకు’ అనే కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ సినిమా నవంబర్ 13న థియేటర్లలోకి రానుంది. టీజర్ విడుదలైన తర్వాత టైటిల్‌పై చర్చ మొదలవడంతో, ఈ వివాదం సినిమాకు ఎలాంటి ప్రచారం తీసుకొస్తుందో చూడాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!