

దర్శకుడు గుణశేఖర్ నూతన నటీనటులతో తెరకెక్కిస్తున్న యూత్‌ఫుల్ థ్రిల్లర్ చిత్రం ‘యుఫోరియా’ ట్రైలర్‌ను ప్రత్యేక ఈవెంట్లో విడుదల చేశారు. భూమికా చావ్లా, సారా అర్జున్, రోహిత్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన పాటలతో మంచి స్పందన పొందింది. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, పలుమార్లు వాయిదా పడిన తర్వాత ఫిబ్రవరి 6 న ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. ట్రైలర్ విడుదల కార్యక్రమానికి సారా అర్జున్, భూమికా చావ్లా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
యూత్‌ఫుల్ బ్యాక్‌డ్రాప్‌లో డ్రగ్స్ సమస్య, దాని వల్ల యువత మరియు కుటుంబాలు ఎదుర్కొనే పరిణామాలు, దారి తప్పిన కుమారుడిని రక్షించేందుకు తల్లి చేసే పోరాటం వంటి అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. గుణశేఖర్ మార్క్ దర్శకత్వం స్పష్టంగా కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాతో సారా అర్జున్ టాలీవుడ్లోకి అడుగుపెడుతుండగా, ఆమె ఇప్పటికే నటించిన బాలీవుడ్ చిత్రం ‘దురంధర్’ భారీ విజయాన్ని సాధించడం విశేషం.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!